నా పెళ్లి ఖాయం చేశావా? నాకు చెప్పలేదేం తమ్ముడు అంటున్న రకుల్
Add ap7am to your home Screen

నా పెళ్లి ఖాయం చేశావా? నాకు చెప్పలేదేం తమ్ముడు అంటున్న రకుల్

Rakul preet about his marriage news
  • బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్
  • వచ్చే ఏడాది వీళ్లు పెళ్లి చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్
  • కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న రకుల్ ప్రీత్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి బాలీవుడ్ కు వెళ్లిన రకుల్ ప్రీత్ అక్కడ కూడా తన మార్కు వేసింది. అటు హిందీతో పాటు దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. అయితే, తెలుగులో ఆమె హవా చాలా వరకు తగ్గిపోయింది. ఆమె చివరి సినిమా 'కొండ పొలం' తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రస్తుతం రకుల్ చేతిలో తెలుగు సినిమాలేమీ లేవు. కమల్ హాసన్ సరసన ‘ఇండియన్2’లో మాత్రం నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె పెళ్లి గురించి ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రకుల్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఇప్పటికే ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పెళ్లిపై ఈ ఇద్దరికీ సదభిప్రాయం ఉందన్నాడు. నెల, తేదీని ఇంకా ఖరారు చేయలేదని చెప్పాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నిజమేనా? అని సోషల్ మీడియాలో రకుల్ ను ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై రకుల్ స్పందించింది. తన తమ్ముడు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన వార్తను షేర్ చేసిన ఆమె.. ‘నా పెళ్లి ఖరారు చేశావా అమన్? మరి, నాకెందుకు చెప్పలేదు తమ్ముడూ. ఏంటో.. నా జీవితం గురించిన వార్త నాకే తెలియకపోవడం ఫన్నీగా ఉంది’ అని రకుల్ ట్వీట్ చేసింది.
Tollywood
Bollywood
Rakul Preet Singh
marriage
brother

More Telugu News