పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును గర్భవతిని చేసిన ‘కొత్తగా మా ప్రయాణం’ హీరో అరెస్ట్
- వర్ధమాన నటుడికి ఇప్పటికే పెళ్లి.. కుమార్తె కూడా
- పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం
- పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే చంపేస్తానని బెదిరింపు
అయితే, ఆ తర్వాత అతడికి వివాహమై కుమార్తె కూడా ఉందన్న విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నట్టు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. యువతి ఇటీవల మరోమారు అతడి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చంపేస్తానని బెదిరించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రియాంత్‌రావును అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు నటించిన ‘కొత్తగా మా ప్రయాణం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.