Anand Mahindra: స్కార్పియో-ఎన్ కొత్త కారు అందుకున్న ఆనంద్ మహీంద్రా... తన కారుకు పేరు సూచించాలంటూ ట్వీట్

  • ఇటీవలే స్పార్పియో-ఎన్ వాహనాన్ని లాంచ్ చేసిన మహీంద్రా
  • ముందస్తు బుకింగ్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • కారు తాళాలు అందించిన షోరూం ఎగ్జిక్యూటివ్
  • చిరస్మరణీయమైన రోజంటూ ఆనంద్ స్పందన
Anand Mahindra receives Scorpio N vehicle and asked a name for it

మహీంద్రా సంస్థ తన స్కార్పియో వాహనాన్ని మరింత అభివృద్ధి చేసి, ఇటీవలే స్కార్పియో-ఎన్ వాహనాన్ని లాంచ్ చేసింది. మహీంద్రా తన కొత్త మోడల్ ద్వారా ఎస్ యూవీ సెగ్మెంట్లో మరోసారి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. కాగా, స్కార్పియో-ఎన్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారిలో మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. 

ఆయన ఇవాళ తన కొత్త స్కార్పియో-ఎన్ కారును అందుకున్నారు. షోరూం ఎగ్జిక్యూటివ్ ఆయనకు కారు తాళాలు అందించారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

ఇవాళ తన జీవితంలో మరపురాని రోజని తెలిపారు. కొత్త స్కార్పియో-ఎన్ వాహనాన్ని అందుకున్నానని వెల్లడించారు. అంతేకాదు, తన కొత్త కారుకు పేరు సూచించాలని నెటిజన్లను కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News