Bollywood: భార్య‌ను మై క్వీన్ అంటూ విడాకుల వార్త‌ను ఖండించిన బాలీవుడ్ స్టార్ హీరో

Ranveer Singh shuts down separation rumours with Deepika Padukone again
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్‌లో అత్య‌ధిక ఫాలోయింగ్ ఉన్న దంపతుల్లో ర‌ణ్ వీర్ సింగ్‌, దీపికా పదుకొణె జంట ముందుంటుంది. చాన్నాళ్ల ప్రేమ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉన్నారు. న‌టులుగా ఇద్ద‌రూ మంచి స్పీడుతో దూసుకెళ్తున్నారు. అయితే, ఈ మ‌ధ్య ఈ ఇద్ద‌రి వివాహ బంధం గురించి కొన్ని పుకార్లు వ‌స్తున్నాయి. ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌టం లేద‌ని, ఈ ఇద్ద‌రూ తొంద‌ర్లోనే విడాకులు తీసుకోబోతున్నార‌ని కొన్ని వారాలుగా బాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. 

అయితే, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై మ‌రొక‌రు తమ ప్రేమ‌ను చూపిస్తూ ఈ వార్త‌ల‌ను ర‌ణ్‌వీర్, దీపిక ఖండిస్తూనే ఉన్నారు. అయినా అవి అగ‌డం లేదు. తాజాగా ర‌ణ్ వీర్ ఈ పుకార్ల‌కు మ‌రోసారి పుల్‌స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న భార్య దీపికను మై క్వీన్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. దీపిక ఈ మ‌ధ్యే ఆభరణాలు, గడియారాలు త‌యారు చేసే ప్ర‌ముఖ బ్రాండ్ కార్టియ‌ర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విష‌యాన్ని కార్టియ‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంది. దీనిపై ర‌ణ్‌వీర్ స్పందించాడు. "మై క్వీన్! నాకు చాలా గర్వంగా ఉంది" అని కామెంట్ పెట్టాడు. దాంతో, ఈ జంట విడిపోతుంద‌న్న పుకార్ల‌కు మ‌రోసారి చెక్ పెట్టిన‌ట్ట‌యింది. ఇప్ప‌టికైనా అలాంటి వార్త‌లు ఆగుతాయో లేదో చూడాలి.
Go Back to Shorts
Bollywood
couple
Deepika Padukone
ranveer singh
divorce
roumers
tweet

More Telugu News