వచ్చే ఆరు నెలల్లో 200 పట్టణాల్లో 5జీ సేవలు.. వచ్చే ఆగస్టు నాటికి బీఎస్ఎన్ఎల్ సైతం: టెలికం మంత్రి వైష్ణవ్
- 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని ప్రకటన
- వచ్చే ఆగస్ట్ 15 నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
- 5జీ సేవలు కూడా అందుబాటులోనే ఉండాలన్న ఆకాంక్ష
వచ్చే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 80-90 ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అశ్వని వైష్ణవ్ చెప్పారు. 5జీ సేవలు కూడా అందుబాటు ధరల్లోనే ఉండాలన్నారు. ఎయిర్ టెల్, జియో పోటాపోటీగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ రెండింటి నుంచి ముందుగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంతవరకు 4జీ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో 5జీ సేవలపై మంత్రి ప్రకటన చేయడం గమనించాలి.