నటి మీనాకు అసూయ కలిగిందట!
- ఆమెకు ఇష్టమైన నందిని పాత్రలో ఐశ్వర్యారాయ్
- తన జీవితంలో మొదటిసారి అసూయ పడుతున్నట్టు మీనా పోస్ట్
- పొన్నియిన్ సెల్వన్ చిత్ర యూనిట్ కు అభినందనలు
ఈ క్రమంలో నటి మీనా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా (మీనాసాగర్16)లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాను ఎంతో మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. అదే సమయంలో ఈ సినిమాలో నందిని పాత్రను (ఆమెకు ఎంతో ఇష్టమైన) పోషించిన ఐశ్వర్యారాయ్ ను చూసి తనకు ఈర్ష్య కలుగుతున్నట్టు మీనా పోస్ట్ పెట్టారు.
‘‘దీన్ని ఎంతో కాలం దాచుకోలేను. నాకు ఊపిరి సలపనీయడం లేదు. దీన్ని బయటకు తీయాల్సిందే. నాకు అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి ఐశ్వర్యారాయ్ ను చూసి అసూయ పడుతున్నాను. ఎందుకంటే ఆమె నా డ్రీమ్ రోల్ అయిన నందిని పాత్రను పీఎస్-1లో (పొన్నియిన్ సెల్వన్) పోషించింది. విజయాన్ని అందుకుంటున్న చిత్ర యూనిట్ కు అభినందనలు’’అని మీనా పోస్ట్ లో పేర్కొంది.