Chandrababu: ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్పవాడు?: చంద్రబాబు

How YSR is greater than NTR asks Chandrababu
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్ ను కలిశారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడూ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. 

1986లో హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకొచ్చానని తెలిపారు. జగన్ మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ చీకటి జీవోను తీసుకొచ్చారని తెలిపారు. జగన్ వచ్చిన తర్వాతే ఆరోగ్య రంగం భ్రష్టుపట్టిందని చెప్పారు. జగన్ సీఎం అయిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలకు గుర్తింపు మాత్రమే వచ్చిందని అన్నారు. రాత్రి వాళ్ల నాన్న ఆత్మతో మాట్లాడి యూనివర్శిటీ పేరును మార్చారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ కలిసి ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారో చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ ఎలా గొప్ప వ్యక్తి అని చంద్రబాబు ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
NTR
Telugudesam
Jagan
YSR
YSRCP

More Telugu News