Mahesh Babu: త్రివిక్రమ్ చేతికి 'హిరణ్య కశిప' ప్రాజెక్టు?

Rana in  Trivikram Movie
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకులలో చారిత్రక .. పౌరాణిక కథలను సమర్థవంతంగా తెరకెక్కించగల అతి తక్కువమందిలో గుణశేఖర్ ఒకరు. 'రుద్రమదేవి' వంటి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాను రూపొందించిన గుణశేఖర్, ఆ తరువాత 'హిరణ్య కశిప' ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని రావాలనుకున్నాడు. నిర్మాణ సంస్థగా సురేశ్ ప్రొడక్షన్స్ .. హీరోగా రానా పేర్లు బలంగా వినిపించాయి.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందనే టాక్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో తెలియదుగానీ, సురేశ్ ప్రొడక్షన్స్ వారు వేరే ప్రాజెక్టులతో ముందుకు వెళ్లారు. 'శాకుంతలం' సినిమాతో గుణశేఖర్ బిజీ అయ్యాడు. ఆ తరువాత 'హిరణ్య కశిప' సినిమా ఉండొచ్చని అనుకుంటే, అది త్రివిక్రమ్ చేతికి వెళ్లినట్టుగా ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది.

త్రివిక్రమ్ కి పురాణ కథలపై మంచి అవగాహన ఉంది. అందువలన గుణశేఖర్ తో సెటిల్మెంట్ చేసుకుని, రానా ఈ ప్రాజెక్టును తీసుకుని వెళ్లి త్రివిక్రమ్ చేతిలో పెట్టడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా బన్నీతో ఉండనుంది. ఈ రెండు సినిమాల తరువాత రానాతో 'హిరణ్య కశిప' ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై గుణశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
Go Back to Shorts
Mahesh Babu
Allu Arjun
Rana Daggubati
Trivikram Movie

More Telugu News