తమిళంలో దూసుకుపోతున్న ప్రియాంక మోహన్!

Priyanka in Dhanush movie
  • టాలీవుడ్ లో పలకరించని సక్సెస్ 
  • కోలీవుడ్ లో కలిసొచ్చిన అదృష్టం 
  • ఇప్పటికే రెండు భారీ హిట్లు కొట్టిన ప్రియాంక 
  • చేతిలో మూడు ప్రాజెక్టులతో బిజీ
వెండితెరపై కథానాయికగా రాణించడం అంత తేలికైన విషయమేం కాదు. అందుకు అందంతో పాటు అభినయం కూడా ఉండాలి .. ఈ రెండింటితో పాటు అదృష్టం కూడా ఉండాలి. టాలీవుడ్ లో అందం .. అభినయంతోనే ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంక అరుళ్ మోహన్ కి, కోలీవుడ్ లో అదృష్టం కూడా తోడైంది. అందుకే అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

తెలుగులో ప్రియాంక చేసిన 'నానీస్ గ్యాంగ్ లీడర్'గానీ .. శర్వానంద్ తో చేసిన 'శ్రీకారం' గాని ఆమెకి కలిసి రాలేదు. ఆ రెండు సినిమాలు పోవడం వలన ఇక్కడ ఆమెకి అంతగా అవకాశాలు రాలేదు. దాంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ,  శివకార్తికేయన్ జోడీగా రెండు భారీ విజయాలను అందుకుంది. సూర్యతోను ఓ సినిమా చేసిన ఈ సుందరి, ఆ తరువాత సినిమాను ధనుశ్ తో చేస్తోంది.

ధనుశ్ హీరోగా తమిళంలో 'కెప్టెన్ మిల్లర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. కొంతసేపటిక్రితం ఆమెకి సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 1930 -  40కి మధ్యలో ఈ కథ నడుస్తుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో పాటు కార్తితో ఒకటి .. శింబుతో ఒకటి సినిమాలు చేయడానికి ప్రియాంక రెడీ అవుతుండటం విశేషం.
Dhanush
Priyanka Arul Mohan
Captain Miller Movie

More Telugu News