Chiranjeevi: 'రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు' అంటున్న చిరంజీవి.. ఏమిటీ సస్పెన్స్?

  • సంచలనం రేపుతున్న చిరంజీవి 10 సెకన్ల ఆడియో
  • ట్విట్టర్ ద్వారా ఆడియో పోస్ట్ చేసిన మెగాస్టార్
  • కొత్త సినిమాలో డైలాగ్ అయ్యుండొచ్చంటున్న నెటిజన్లు
Politics not went away from me says Chiranjeevi

ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకన్ల ఆడియో చర్చనీయాంశంగా మారింది. 'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ... రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఇది చిరంజీవి కొత్త సినిమా 'గాడ్ ఫాదర్' లోని డైలాగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

More Telugu News