'జిన్నా' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- 'జిన్నా'గా మంచు విష్ణు
- యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే కథ
- కథానాయికలుగా పాయల్ - సన్నీలియోన్
- సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.'ఓ గోలీ సోడావే .. గుండెకాయ పానూ బీడావే ..మైండు కాస్త పిచ్చెక్కించే అందాలు మెక్కేశావే ' అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి బాలాజీ సాహిత్యం అందించాడు. నకాశ్ అజాజ్ - నూతన్ మోహన్ ఆలపించారు.
విష్ణు సరసన నాయికలుగా పాయల్ - సన్నీలియోన్ అలరించనున్నారు. ఈ మధ్య కాలంలో హీరోగాను .. నిర్మాతగాను విష్ణుకి హిట్స్ లేవు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో విష్ణు ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి