Tamannaah: బిగ్ బాస్ ఇంట్లో తమన్నా సందడి

  • రెండు వారాల కిందట ప్రారంభమైన బిగ్ బాస్-6
  • నేడు సండే ఎపిసోడ్
  • బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టిన తమన్నా
  • ప్రోమో విడుదల చేసిన స్టార్ మా
Tamannaah enters into Bigg Boss house

ఇటీవల తెలుగు బిగ్ బాస్ షో 6వ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్సాహభరితంగా సాగుతున్న బిగ్ బాస్ షోలో ఈ సండే ఎపిసోడ్ కు ఓ ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ చిత్రం 'బబ్లీ బౌన్సర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు. హౌస్ లోని కంటెస్టెంట్లతో తమన్నా ఉల్లాసంగా గడిపారు. బిగ్ బాస్ పోటీదారుల చమక్కులను ఆస్వాదించారు. 

మరోవైపు ఈ జోష్ లో హోస్ట్ నాగార్జున కూడా పాలుపంచుకున్నారు. బిగ్ బాస్ స్టేజి పైనుంచే కంటెస్టెంట్లతో, తమన్నాతో చమత్కారంగా మాట్లాడుతూ ఆడియన్స్ ను అలరించారు. తద్వారా ఇవాళ్టి ఎపిసోడ్ ను రక్తికట్టించారు. ఈ మేరకు ప్రోమో వీడియోను స్టార్ మా చానల్ పంచుకుంది.

More Telugu News