తేజస్వి యాదవ్‌కు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన సీబీఐ
- ఐఆర్సీటీసీ కుంభకోణంలో తేజస్విపై కేసు
- మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా మాట్లాడారన్న సీబీఐ
- 2018 ఆగస్టులో తేజస్వికి బెయిల్ ఇచ్చిన కోర్టు
హోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించిన ఈ కేసులో 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2006లో రాంచీ, పూరీలో ఐఆర్సీటీసీ హోటల్స్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో 2018 ఆగస్టులో తేజస్వి యాదవ్, ఆయన తల్లి రబ్రీదేవిలకు బెయిల్ మంజూరయింది. ఇదే కేసులో ఈడీ కూడా మనీలాండరింగ్ ఆరోపణలతో ఛార్జిషీట్ నమోదు చేసింది.