విజయ్ 'వారసుడు' స్పెషాలిటీ అదే .. అందుకే ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్!
Add ap7am to your home Screen

విజయ్ 'వారసుడు' స్పెషాలిటీ అదే .. అందుకే ఒక రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్!

Varasudu Movie Update
  • విజయ్ హీరోగా రూపొందుతున్న 'వరిసు' 
  • తెలుగు టైటిల్ గా 'వారసుడు' ఖరారు 
  • డిసెంబర్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • అప్పటికి హీరోగా విజయ్ కి 30 ఏళ్లు పూర్తి  
విజయ్ హీరోగా ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళంలో 'వరిసు' .. తెలుగులో 'వారసుడు' అనే టైటిల్స్ ను సెట్ చేశారు. విజయ్ సరసన నాయికగా రష్మిక నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

1984లో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ తెరకి పరిచయమైన విజయ్, ఆ తరువాత 1992  డిసెంబర్ లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే ఈ డిసెంబర్ నాటికి హీరోగా విజయ్ ఎంట్రీ  ఇచ్చి 30 ఏళ్లు పూర్తవుతాయి. అందువలన డిసెంబర్ లోనే 'వరిసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇక తెలుగులోను 'వారసుడు' పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా విజయ్ కి మార్కెట్  పెరిగింది. ఈ సినిమా తరువాత లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సినిమా ఉండనుంది 'మాస్టర్' హిట్ తరువాత మళ్లీ ఇద్దరూ కలిసి మరో ప్రయోగం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విజయ్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు.
Vijay
Rashmika Mandanna
Varasudu Movie

More Telugu News