Krishnam Raju: కృష్ణంరాజు తలపై జుట్టును ప్రేమతో సరిచేస్తున్న ‍ప్రభాస్‌.. మళ్లీ వైరల్‌ అయిన పాత వీడియో ఇదిగో

Krishnam raju with Prabhas viral old video
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనకు సంబంధించిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణంరాజు, ఆయన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ల అనుబంధంపైనా.. కృష్ణంరాజును కోల్పోవడంతో ఆవేదనలో మునిగిపోయిన ప్రభాస్ గురించీ.. అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఉన్న ఓ పాత వీడియో తాజాగా వైరల్ గా మారింది.

ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమై..
ఓ సారి కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమయ్యారు. ముదురు ఆకుపచ్చ రంగు షేర్వానీ వేసుకున్న కృష్ణంరాజు రెడీ అయి బయటికి వచ్చారు. అయితే ఆయన జుట్టు చెదిరిపోయి ఉండటాన్ని ప్రభాస్ గమనించారు. ఒకసారి ఎడమ చేత్తో కృష్ణంరాజు జుట్టును సరిచేయడానికి ప్రభాస్ ప్రయత్నించారు. సరికాకపోవడంతో నవ్వుతూ మళ్లీ కుడిచేత్తో సరిచేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ నవ్వుతూ ఫొటోలకు పోజిచ్చారు. 

ఇది ఏ సందర్భంలో తీసినదో ప్రస్తావించకున్నా.. కృష్ణ అనే ఓ నెటిజన్ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కృష్ణంరాజును కోల్పోవడం బాధాకరమని కామెంట్ పెట్టారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. లక్షన్నరకుపైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది లైక్ చేశారు. రీట్వీట్ చేశారు.
Go Back to Shorts
Krishnam Raju
Prabhas
Movie news
Offbeat
Tollywood

More Telugu News