పది రోజుల్లో కొత్త పార్టీ గురించి ప్రకటిస్తా: గులాం నబీ ఆజాద్
- జమ్మూలో బహిరంగ సభ నేపథ్యంలో ఆజాద్ ప్రకటన
- కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మద్దతుదారులు రెట్టింపైనట్టు వెల్లడి
- 30-35 నియోజకవర్గాల నేతలతో సమావేశాలు
జమ్మూలో బహిరంగ సభను తలపెట్టిన ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతిచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగినట్టు ప్రకటించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆజాద్ కు మంచి మద్దతు లభిస్తున్న క్రమంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు.