అమెరికా వెళ్లేందుకు మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు అనుమతి
- అమరావతి అలైన్‌మెంట్ అక్రమాలంటూ నారాయణపై కేసు
- మంగళవారమే ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- షరతులను సడలించాలంటూ తాజాగా హైకోర్టులో నారాయణ పిటిషన్
- అమెరికా వెళ్లి వచ్చేందుకు నారాయణకు 3 నెలల సమయమిచ్చిన హైకోర్టు
వైద్య చికిత్సల కోసం అమెరికా వెళ్లాల్సి ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్న నారాయణ... ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై నారాయణ తరఫు న్యాయవాది వాదన విన్న హైకోర్టు... ముందస్తు బెయిల్ షరతులను సడలించింది. వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చేందుకు నారాయణకు హైకోర్టు 3 నెలల సమయాన్ని కేటాయించింది.