Openers: ఛేజింగ్ లో శ్రీలంకకు శుభారంభం అందించిన ఓపెనర్లు

  • ఆసియా కప్ లో సూపర్-4 మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు
  • లక్ష్యఛేదనలో లంక దూకుడు
  • 7 ఓవర్లలో 63 పరుగులు
Openers give Sri Lanka a solid start against Team India

టీమిండియాపై 174 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కుశాల్ మెండిస్, పత్తుమ్ నిస్సాంక జోడీ 7 ఓవర్లలో 63 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. నిస్సాంక 24 బంతుల్లో 36, మెండిస్ 18 బంతుల్లో 27 పరుగులు చేశారు. 

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు విసిరి 9 పరుగులివ్వగా, అర్షదీప్ సింగ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అర్షదీప్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.

More Telugu News