Pavan Kalyan: పవన్- సురేందర్ రెడ్డి ప్రాజెక్టు విషయంలో వచ్చేసిన క్లారిటీ!

  • వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టిన పవన్ 
  • సెట్స్ పై ఉన్న 'హరి హర వీరమల్లు'
  • 'వినోదయా సితం' రీమేక్ కి సన్నాహాలు
  • హరీశ్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్'
  • లైన్లోనే ఉన్న సురేందర్ రెడ్డి ప్రాజెక్టు
Pavan in Surendar Reddy movie

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఇక ఆ తరువాత సినిమాగా 'వినోదయా సితం' రీమేకులో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, అందుకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేసుకుంటోంది. 

ఈ సినిమా తరువాత ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చేయనున్నారు. ఆ తరువాత ప్రాజెక్టును సురేందర్ రెడ్డితో చేయనున్నట్టుగా ఒక టాక్ అయితే వచ్చింది గానీ, అందుకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్టు లేనట్టేనని అంతా అనుకున్నారు. 

అయితే, తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్టు ఉందని చెప్పారు. 'ఏజెంట్' తరువాత సురేందర్ రెడ్డి చేసే సినిమా పవన్ తోనే ఉంటుందని ఆయన తెలిపారు. దాంతో ఈ సినిమా ఉందనే విషయం ఖరారైపోయింది. చిరంజీవితో 'సైరా' .. చరణ్ తో 'ధ్రువ' ..  బన్నీతో రేసుగుర్రం' చేసిన సురేంద్ర రెడ్డి, ఆ తరువాత సినిమాను పవన్ తో చేయనుండటం మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.

More Telugu News