Harish Rao: నిర్మలా సీతారామన్ కు హరీశ్ రావు సవాల్

Harish Rao challenge to Nirmala Sitharaman
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవాలు బయటపడతాయనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని ఆమె విమర్శించారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఖండించారు. దిగజారి మాట్లాడొద్దని అన్నారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిర్మల అసత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు. 2021లోనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరిందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరకపోతే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని... చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
Go Back to Shorts
Harish Rao
TRS
BJP
Narendra Modi
Nirmala Sitharaman

More Telugu News