Shivakarthikeyan: 'ప్రిన్స్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • 'ప్రిన్స్' గా శివకార్తికేయన్
  • దర్శకుడిగా అనుదీప్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • అక్టోబర్ 21వ తేదీన సినిమా రిలీజ్    
Prince movie lyrical song  released

ఈ మధ్య కాలంలో కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు చేయడానికీ, తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తో శివకార్తికేయన్ ఒక సినిమా చేశాడు .. ఆ సినిమా పేరే 'ప్రిన్స్'. తమిళంలో నిర్మితమైన ఈ సినిమాను తెలుగులోను అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'ఇంగ్లాండ్ క్వీన్ .. నిన్ను ఇల్లా రమ్మన్నాను .. నువ్వు నీతో పాటు మూను లైటు తీసుకొచ్చావే' అంటూ ఈ పాట సాగుతోంది. మాస్ ను దృష్టిలో పెట్టుకుని తమన్ కంపోజ్ చేసిన పాట ఇది. జోరుగా హుషారుగా సాగే బీట్ ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా,  రామ్ మిర్యాల బృందం ఆలపించింది.

ఈ పాటకి 'శోభి' అందించిన కొరియోగ్రఫీ బాగుంది. శివ కార్తికేయన్ డాన్స్ విషయంలో రెచ్చిపోయినట్టుగానే కనిపిస్తోంది. సినిమాలో ఆయన సరసన నాయికగా మరియా అలరించనుంది. సునీల్ నారంగ్ .. సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా శివ కార్తికేయన్ కి  టాలీవుడ్ లో ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

More Telugu News