పవన్ బర్త్ డే స్పెషల్ గా 'హరిహర వీరమల్లు' నుంచి రానున్న అప్ డేట్!
Add ap7am to your home Screen

పవన్ బర్త్ డే స్పెషల్ గా 'హరిహర వీరమల్లు' నుంచి రానున్న అప్ డేట్!

Hari Hara Veera Mallu movie update
  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్ 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు 
రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ గుర్రపు బండిపై వెళుతున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. కొంతమంది సైనికులు ఆయనను పట్టుకోవడానికి వెంటాడుతున్నారు. ఎర్రని వస్త్రంలో 'వీరమల్లు' కట్టిన మూట చూస్తుంటే, ఆయన ఏవో వస్తువులు దొంగిలించి పారిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు.

చారిత్రక నేపథ్యంతో ఈ సినిమాలో గజదొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడనే విషయం తెలుసును గనుక, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తరువాత వచ్చిన ఈ పోస్టర్, సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా రేపు సాయంత్రం 5: 45 నిమిషాలకు ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వదలనున్నట్టుగా ప్రకటించారు. 

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అర్జున్ రామ్ పాల్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా అలరించనుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
PavanKalyan
Nidhi Aagarwal
Hari Hara Veeramallu Movie

More Telugu News