అభిమానికి పాదాభివందనం చేసిన హృతిక్ రోషన్
Add ap7am to your home Screen

అభిమానికి పాదాభివందనం చేసిన హృతిక్ రోషన్

Hrithik Roshan touches fans feet on stage fans call him most humble superstar
  • ముంబైలో ఫిట్ నెస్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు
  • అభిమానికి గుడీ బ్యాగ్ అందించేందుకు స్టేజీపైకి ఆహ్వానం
  • నటుడి పాదాలకు నమస్కారం చేసిన అభిమాని
  • ప్రతినమస్కారం చేసిన  హృతిక్
నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నది మన సనాతన భారతీయ సంస్కృతిలో భాగం. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ దీన్ని ఆచరించాడు. అభిమానులను అతడు ఏ విధంగా గౌరవిస్తాడన్న దానికి నిదర్శనంగా శనివారం ఓ ఘటన జరిగింది. ఫిట్ నెస్ కు సంబంధించి ముంబైలో ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికి హృతిక్ రోషన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా గుడీబ్యాగ్ ను బహూకరించేందుకు ఓ అభిమానిని స్టేజీపైకి రావాలని హృతిక్ రోషన్ ఆహ్వానించాడు.

సదరు అభిమాని స్టేజీపైకి రావడంతోనే హృతిక్ రోషన్ పాదాలకు నమస్కారం చేశాడు. అంతే హృతిక్ రోషన్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి అభిమాని పాదాలకు నమస్కారం చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో ఒకరు షేర్ చేశారు. దీనికి అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వెరీ గుడ్ సూపర్ స్టార్, మోస్ట్ హంబుల్ సూపర్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)
Hrithik Roshan
touches
fan
feet

More Telugu News