నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హఠాన్మరణం
- గోవాలో ఉన్న ఆమెకు సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు
- పలు సీరియళ్లు, సినిమాల్లో నటించిన సోనాలి
- 2019 హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ
‘ఏక్ మా జో లాఖన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ సీరియల్ లో 2016లో మొదటిసారిగా సోనాలి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆమె నటించింది. 2016 డిసెంబర్ లో 42 ఏళ్ల భర్త సంజయ్ ఫోగట్ ను ఆమె కోల్పోయింది. వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద రీతిలో నాడు ఆయన మరణించారు. సోనాలికి ఒక కుమార్తె ఉంది.