Corona Virus: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Corona positive cases number declines in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 17,521 శాంపిల్స్ పరీక్షించగా, 265 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 142 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. మరో 301 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,173 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,183 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Corona Virus
Telangana
Positive Cases
Media Bulletin

More Telugu News