తెలంగాణలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 231 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 992 మంది
- ఇంకా 4,720 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,27,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,18,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,720 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
