బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వికి బెస్ట్ విషెస్ చెప్పిన కేటీఆర్
- నితీశ్ సర్కారులో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి
- తేజస్వికి అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్
- బీహార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్ష
ఈ క్రమంలో తేజస్వికి తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. నూతనంగా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తేజస్వికి అభినందనలు చెప్పిన కేటీఆర్... ఈ పదవితో రాష్ట్ర ప్రజలకు ఆయన మరింత మేర మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.