Vijay Devarakonda: తనతో డేటింగ్ చేయాలనుందన్న బాలీవుడ్ భామకు టెక్ట్స్ మెసేజ్ పంపిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda text message to Sara
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్-ముంబయి మధ్య ఈ యువ హీరో చక్కర్లు కొడుతున్నాడు. కాగా, బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ 'కాఫీ విత్ కరణ్' లో తన వ్యాఖ్యలతో కలకలం రేపింది. "ఎవరితో డేటింగ్ కు వెళ్లాలనుకుంటున్నావు?" అని కరణ్ జొహార్ అడగ్గా, సారా అలీ ఖాన్ తడుముకోకుండా "విజయ్ దేవరకొండ" అని సమాధానం చెప్పింది.

అయితే దీనిపై విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని జాతీయ మీడియా ప్రయత్నించింది. అందుకు విజయ్ బదులిస్తూ, 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే సారా అలీ ఖాన్ కు టెక్ట్స్ మెసేజ్ పంపించానని వెల్లడించాడు. ఆమె తనతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పడం సంతోషానికి గురిచేసిందని తెలిపాడు. 

అయితే సారా డేటింగ్ ప్రతిపాదనకు ఏం సమాధానం చెబుతారని అడగ్గా... "రిలేషన్ షిప్ అనే పదాన్ని కూడా సరిగ్గా చెప్పలేని వాడ్ని... ఇక నేను ఆ సంబంధంలో ఎలా ఇమడగలను!" అంటూ తెలివిగా తప్పించుకున్నాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Text Message
Sara Ali Khan
Bollywood

More Telugu News