తెలంగాణలో 500కి దిగువన కరోనా కొత్త కేసులు
- గత 24 గంటల్లో 31,629 కరోనా పరీక్షలు
- 494 పాజిటివ్ కేసుల వెల్లడి
- హైదరాబాదులో 223 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 1,054 మంది
- ఇంకా 5,107 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,26,778 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,17,560 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,107 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
