తెలంగాణలో తాజాగా 396 మందికి కరోనా
- గత 24 గంటల్లో 24,938 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 193 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 705 మంది
- ఇంకా 5,910 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,25,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,15,735 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,910 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
