తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 40,451 కరోనా పరీక్షలు
- 652 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
- హైదరాబాదులో 220 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 851 మంది
- ఇంకా 6,219 మందికి చికిత్స
అదే సమయంలో 851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,25,360 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,15,030 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,219 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు.
