తెలంగాణలో తాజాగా 984 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 40,663 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 365 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 923 మంది
- ఇంకా 6,418 మందికి చికిత్స
అదే సమయంలో 923 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,24,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,14,179 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,418 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
