టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కవిత పరామర్శ... వీడియో ఇదిగో
- ఇటీవలే హత్యాయత్నం నుంచి తప్పించుకున్న జీవన్‌రెడ్డి
- జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
- కవితను చూసి కన్నీరు పెట్టుకున్న జీవన్‌రెడ్డి భార్య
- భయపడాల్సిన పనిలేదని, అండగా ఉంటామని కవిత భరోసా
ఈ సందర్భంగా కవితను చూసినంతనే జీవన్ రెడ్డి భార్య భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖం ఆపుకోలేక కవిత ముందే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెను ఓదార్చిన కవిత... తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని, నేతలకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని కూడా ఆమె జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు.