ఓ శుభవార్తతో ఈ మాసాన్ని ప్రారంభిద్దాం: కేటీఆర్

KTR says govt will share a good news for handloom workers
  • చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన కేటీఆర్
  • బీమా పథకం తెస్తున్నామని వెల్లడి
  • ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం
  • అదే రోజున బీమా పథకం అమలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ వారాన్ని/నెలను ఓ శుభవార్తతో ప్రారంభిద్దామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ సర్కారు చేనేత, మరమగ్గం కార్మికులందరికీ సరికొత్త బీమా సదుపాయాన్ని తీసుకువస్తోందని కేటీఆర్ వెల్లడించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు. రైతు బీమా తరహాలోనే, చేనేత కార్మికులకు బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమం అని కేటీఆర్ వెల్లడించారు.
Go Back to Shorts
KTR
Insurance
Handloom
Powerloom
Workers
TRS
Telangana

More Telugu News