Telangana: కాలికి బ్యాండేజీ, ఒంటిపై బ‌నియ‌న్‌తో కేటీఆర్‌... వైరల్ అవుతున్న ఫొటో

ktr photo gone viral which shows him in banian and shorts
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవ‌లే కింద‌ప‌డిపోవ‌డంతో ఆయ‌న కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టిక‌ప్పుడు చికిత్స చేయించుకున్న కేటీఆర్‌... 3 వారాల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పిన విష‌యాన్ని వెల్ల‌డించి, ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఆసుప‌త్రి నుంచి కాలికి పెద్ద బ్యాండేజీతో ఇంటికి చేరిన త‌న ఫొటోను గ‌తంలోనే కేటీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా కాలికి అదే బ్యాండేజీనే కొన‌సాగిస్తున్న కేటీఆర్‌... ఒంటిపై బ‌నియ‌న్‌, షార్ట్‌తో క‌నిపించారు. సోఫాలో కాలిపై భారం ప‌డ‌కుండా కాళ్లు బార్ల జాపుకుని కాలి కింద దిండ్లు పెట్టుకుని కూర్చున్న కేటీఆర్‌.. ఫైళ్ల‌ను ప‌రిష్క‌రించే ప‌నిలో నిమగ్న‌మ‌య్యారు. కొంత ఫైల్ వ‌ర్క్ చేశాను అన్న కామెంట్‌తో త‌న ఫొటోను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి వర్క్ ఫ్రం హోం అనే ట్యాగ్ ను జత చేశారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Telangana
KTR
TRS

More Telugu News