నేతల పిల్లలపై రాజకీయ విమర్శలు వద్దు: కేటీఆర్
- సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి
- పిల్లలను రాజకీయ రొంపిలోకి లాగొద్దని సూచన
- సిద్ధాంతాలు, పని తీరు ఆధారంగానే వైరి వర్గాన్ని ఎదుర్కొందామని పిలుపు
ఇకపై రాజకీయ నేతల పిల్లలను రాజకీయ రొంపిలోకి లాగే దుష్ట సంస్కృతికి చరమ గీతం పాడదామంటూ కేటీఆర్ తన సొంత పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు. వర్గ శత్రువులను వారి సిద్ధాంతాలు, నిర్ణయాలు, పని తీరు ఆధారంగానే విమర్శలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.