కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో డోపింగ్ కలకలం

Commonwealth Games bound Indian athlete reportedly tested positive in dope test
మరో మూడ్రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానుండగా, భారత అథ్లెటిక్స్ బృందంలో డోపింగ్ కలకలం రేగింది. మహిళల 4×100 రిలే బృందంలో ఓ అథ్లెట్ నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్టు తెలుస్తోంది. డోప్ టెస్టులో పాజిటివ్ రావడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఆ మహిళా అథ్లెట్ ను తొలగించినట్టు వెల్లడైంది. 

ఆ అథ్లెట్ పేరును భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) బయటపెట్టలేదు. ఈ పరిణామం అనంతరం, మహిళల రిలే టీమ్ లో ప్రస్తుతం నలుగురు సభ్యులే ఉన్నారు. తొలగించిన అథ్లెట్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియరాలేదు. కామన్వెల్త్ క్రీడలు ఈసారి ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.
Go Back to Shorts
Athlete
Dope Test
Positive
India
Commonwealth Games

More Telugu News