కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ను చంపుతానంటూ బెదిరింపులు.. కేసు నమోదు
- ఇన్ స్టాగ్రామ్ ద్వారా బెదిరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి
- ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించిన విక్కీ కౌశల్
- కత్రినాను వెంబడిస్తున్నాడంటూ ఫిర్యాదు
ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో వివరించాడు. సదరు వ్యక్తి క్రతినా కైఫ్ ను వెంబడిస్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.
ఇక, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం వీరు వరుసగా సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉండడం గమనార్హం. ఇటీవలే మాల్దీవుల్లో ఈ జంట విహరించి వచ్చిన విషయం తెలిసిందే.