ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది: 'బంజారాహిల్స్ ఇళ్ల కూల్చివేత'పై మంత్రి తలసాని

Talasani reacts on houses demolition in Ambedkar Nagar
  • బంజారాహిల్స్ అంబేద్కర్ నగర్ లో ఇళ్ల కూల్చివేత
  • విచారం వ్యక్తం చేసిన మంత్రి తలసాని
  • ఘటనపై సమీక్ష చేపట్టామని వెల్లడి
  • పేదలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.46లోని అంబేద్కర్ నగర్ లో ఇవాళ కొన్ని ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించినట్టు తలసాని వెల్లడించారు. 

అంబేద్కర్ నగర్ లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఇక్కడ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తుందని స్పష్టం చేశారు. కోరుకున్న వారికే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని వివరించారు. సొంతస్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి జీవో 58 కింద స్థలాలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు.
Go Back to Shorts
Talasani
Ambedkar Nagar
Banjara Hills
Hyderabad
Double Bedroom
TRS
Telangana

More Telugu News