Vijay Devarakonda: పూరి జగన్నాథ్ 'లైగర్' ట్రైలర్ విడుదల!

Liger movie trailer released
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందించాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక విలేజ్ స్థాయి నుంచి బాక్సర్ గా ఎదిగిన కుర్రాడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. 

ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటిక్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ పాత్రలోని వేరియేషన్స్ ను .. అతను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు. అందుకోసం ఎదుర్కున్న పరిస్థితులపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 

విజిట్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ పోషించిన మాస్ రోల్ మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన మైక్ టైసన్ కూడా ట్రైలర్ లో మెరిశాడు. అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, మకరంద్ దేశ్ పాండే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Vijay Devarakonda
Aananya Panday
Liger Movie
Puri Jagannadh

More Telugu News