వేగంగా దూసుకొచ్చి నలుగురి ప్రాణాలు తీసిన అంబులెన్స్... వీడియో ఇదిగో
- కర్ణాటకలోని ఉడుపిలో ఘటన
- వేగంగా దూసుకువచ్చి అడ్డంగా తిరిగిపోయిన అంబులెన్స్
- టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని ఆపై తిరగబడిపోయిన వైనం
- ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు
ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ సహా నలుగురు చనిపోగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ టోల్ ప్లాజాకు సమీపిస్తున్న సమయంలో వాహనాల దారిలో పడిపోయిన ఓ డివైడర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా దూసుకురావడంతో బిత్తరపోయాడు. అంబులెన్స్ నుంచి తప్పించుకునేందుకు అతడు చేసిన యత్నాలు సఫలం కాలేదు. వేగంగా వచ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత ఆ టోల్ ప్లాజా ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేలపై జారుకుంటూ వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవడంతో ఎగిరి పడ్డారు.