Punjab: అమృత్‌స‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌... సింగ‌ర్ మూసేవాలా హ‌త్య కేసు నిందితుడు హ‌తం

singer Sidhu Moosewala murder case accused died in an encounter
షార్ట్స్‌లో చూడండి
పంజాబ్‌లో ఇటీవ‌లే చోటుచేసుకున్న సింగ‌ర్ సిద్దూ మూసేవాలా హ‌త్య కేసుకు సంబంధించిన నిందితులు, పోలీసుల మ‌ధ్య బుధ‌వారం అమృత్ స‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మూసేవాలా హంత‌కుల్లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న జ‌గ‌రూప్ సింగ్ హ‌త‌మ‌య్యాడు. కాల్పుల్లో ముగ్గురు పోలీసుల‌కు కూడా గాయాల‌య్యాయి. ఈ సందర్భంగా రికార్డు అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పంజాబ్‌లో మూసేవాలా హ‌త్య కేసు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో కొత్త‌గా కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌ముఖుల‌కు క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త‌ను తొల‌గించింది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన రోజుల వ్య‌వ‌ధిలోనే మూసేవాలా హ‌త్య ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు... బుధ‌వారం త‌మ‌కు తార‌స‌పడిన నిందితుల‌ను అరెస్ట్ చేసే యత్నం చేయ‌గా... పోలీసుల‌పై నిందితులు కాల్పులు జ‌రుపుతూ త‌ప్పించుకునే య‌త్నం చేశారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జ‌రిపారు.
Go Back to Shorts
Punjab
Encounter
Punjab Police
Sidhu Moosewala

More Telugu News