ఈ ఫొటోలు ఎక్కడో విదేశాల్లోని సీన్లు కాదు... మన ఓఆర్ఆర్‌వే!
- ప్రారంభమైన వర్షాకాలం
- ఓఆర్ఆర్ పొడవునా పరచుకున్న పచ్చదనం
- ఫొటోలను పంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
ఓఆర్ఆర్ తాజా పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెబుతూ తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓఆర్ఆర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో తీసిన తాజా ఫొటోలను కూడా ఆయన జత చేశారు. ఓఆర్ఆర్ ఇలా అత్యంత సుందరంగా, ఆహ్లాదకరంగా మారిపోవడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌ల కృషే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.