కత్రినా కైఫ్ అన్నతో ఇలియానా డేటింగ్​!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కత్రినా కైఫ్ అన్నతో ఇలియానా డేటింగ్​!

Is Ileana Dcruz dating Katrina Kaifs brother Sebastien
  • కత్రినా కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఇలియానా
  • మాల్దీవుల్లో కత్రినా పుట్టిన రోజు వేడుకల్లో సందడి
  • కత్రినా సోదరుడు సెబాస్టియన్ , ఇలియానా ప్రేమలో ఉన్నట్టు వార్తలు 
మోడలింగ్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకున్న నటి ఇలియానా డిక్రూజ్. ‘దేవదాసు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ గోవా సుందరి తెలుగులో చాన్నాళ్లు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిన ఇలియానా అనుకున్నంత మేర రాణించలేకపోతోంది. ఇదిలా ఉండగా.. వ్యక్తిగత జీవితంలో ఇలియానా కొత్త తోడు వెతుక్కున్నట్టు తెలుస్తోంది. మరో బాలీవుడ్ అగ్ర నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్, ఇలియానా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా కత్రినా కుటుంబ సభ్యులతో కలిసి ఇలియానా ఇటీవల విహార యాత్రకు వెళ్లింది. 

ఈనెల 16న కత్రినా కైఫ్ తన 39వ పుట్టినరోజును మాల్దీవుల్లో జరుపుకుంది. కత్రినా వెంట ఆమె  భర్త, హీరో విక్కీ కౌశల్‌, సోదరుడు సెబాస్టియన్, ఇలియానా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కత్రినా కుటుంబ సభ్యులతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘సన్‌షైన్, కాక్‌టెయిల్స్, బర్త్ డే  కేక్’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. కత్రినా కైఫ్ అన్న సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తోందని, అందుకే వాళ్ల కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లిందని తెలుస్తోంది. అయితే, తమ బంధంపై ఈ ఇద్దరూ ఇంకా  స్పందించలేదు. ఈ మధ్య ‘ది బిగ్ బుల్‌’ చిత్రంలో తన నటనతో ప్రశంసలు అందుకున్న ఇలియానా ఇంతకు ముందు ఆండ్రూ నీబోన్‌తో చాన్నాళ్లు డేటింగ్ చేసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోయారు.
Tollywood
Bollywood
ileana
Katrina Kaif
dating
maldives

More Telugu News