తెలంగాణలో 600కి పైన కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 28,912 కరోనా పరీక్షలు
- 608 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 324 కొత్త కేసులు
- 663 మందికి కరోనా నయం
- ఇంకా 4,900 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 8,09,337 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,00,326 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,900 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.
