ఏ పదాన్ని కూడా నిషేధించలేదు: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ
- జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలేనన్న స్పీకర్
- అన్ పార్లమెంటరీ పదాల డిక్షనరీని విపక్ష నేతలు చదివారా? అంటూ ప్రశ్న
- చదివుంటే దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని వ్యాఖ్య
అన్ పార్లమెంటరీ పదాలను గతంలో బుక్ రూపంలో విడుదల చేసేవారని... పేపర్ వేస్ట్ చేయడం ఎందుకని... ఇప్పుడు ఆ పదాలను ఇంటర్నెట్ లో పెట్టామని ఓం బిర్లా తెలిపారు. అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీల డిక్షనరీని వాళ్లు (విపక్షాలు) చదివారా? అని ఓం బిర్లా ప్రశ్నించారు. ఒకవేళ చదివున్నట్టయితే ఇలాంటి దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని అన్నారు. 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో అభ్యంతరకర పదాలను విడుదల చేశారని... 2010 నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తున్నారని చెప్పారు.