YSRCP: గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి: విజ‌య‌సాయిరెడ్డి

ysrcpp leader vijay sai reddy satires on chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఆర్థిక సంక్ష‌భంలో చిక్కుకున్న దేశాన్ని, దేశ ప్ర‌జ‌ల‌ను వ‌దిలేసి విదేశాల‌కు పారిపోయిన శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బా‌య రాజ‌ప‌క్స ఉదంతాన్ని పోలుస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024 త‌ర్వాత గొట‌బా‌య మాదిరిగానే ఏపీని వ‌ద‌ల‌నున్న చంద్ర‌బాబు... గొట‌బా‌య మాదిరే సింగ‌పూర్ చేరుకుంటార‌ని ఆయ‌న ఆరోపించారు. 

ఈ మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ వేదిక‌గా విజయ‌సాయిరెడ్డి ఓ ట్వీట్ సంధించారు. ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశార‌ని, సింగ‌పూర్‌లో ఓ హోటల్ కొనుక్కున్నార‌ని ఆ ట్వీట్‌లో సాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ జెట్‌ను రెడీగా పెట్టుకున్నారంటూ చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి అన్న సాయిరెడ్డి... ఇద్దరి చివరి మజిలీ సింగపూరేనంటూ సెటైర్ సంధించారు.
Go Back to Shorts
YSRCP
TDP
Chandrababu
Vijay Sai Reddy
Sri Lanka
Gotabaya Rajapaksa
Singapore

More Telugu News