అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం... ఈ నెల 14 వరకు తెలంగాణలో రెడ్ అలర్ట్
- పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
- కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు
- తాజా బులెటిన్ లో వెల్లడించిన హైదరాబాద్ కేంద్రం
సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఓవైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.