Ram: తమిళ హీరో శింబూని కలిసిన రామ్!

  • రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
  • ఈ సినిమా కోసం 'బుల్లెట్' పాట పాడిన శింబూ 
  • తెలుగు .. తమిళ భాషల్లో ఈ 14వ తేదీన రిలీజ్
  • తమిళనాట ప్రమోషన్స్ లో బిజీగా రామ్
The Ghost movie update

రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ది వారియర్' సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్  తమిళనాట జోరందుకున్నాయి. 

ఇతర భాషల్లో తమ సినిమాల ప్రమోషన్స్ చేసే సమయంలో అక్కడి హీరోల హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హీరోల ద్వారా వాళ్ల అభిమాన సంఘాల సపోర్ట్ కూడా ఉంటుంది. అందువలన  హీరోలందరి మధ్య ఇప్పుడు మంచి సంబంధాలు ఉంటున్నాయి. అలా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ .. శింబూను కలిశాడు. 

ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామికీ .. శింబూకి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ సినిమా కోసం ఆయన శింబూ చేత 'బుల్లెట్' పాట పాడించాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట వ్యూస్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా కృతిశెట్టి అలరించనుంది.

More Telugu News