మరో రీమేక్‌లో పవర్ స్టార్ పవన్.. రహస్యంగా పూజ చేసేశారు
- తమిళ్ హిట్ చిత్రం ‘వినోదాయ సిత్తం’ రీమేక్ కు పవన్ అంగీకారం!
- సాయిధరమ్ తేజ్ కీలక పాత్ర
- తమిళ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం
- తెలుగులోనూ ఆయనే తీస్తాడని టాక్
సముద్రఖని దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌లో పవన్ నటించనున్నారని, అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్ర పోషిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ ఒకే అయిందని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. రహస్యంగా పూజ కూడా జరిగిందట. ఈ నెల 12 నుంచి మొదలవుతుందని సమాచారం.
తమిళ మాతృకను తీసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా ఈ చిత్రంలో పాలు పంచుకుంటున్నాడట. మాతృకకు కొద్దిగా మార్పులు చేసి స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని అంటున్నారు. సినిమాకు సంబంధించి తొందర్లోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడా అప్పుడే ప్రకటిస్తారు.